సుప్రీంను ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబాలు

Supreme court
Supreme court

ఢిల్లీ: దిశ నిందితులను చటాన్‌పల్లి వద్ద తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై దిశ నిందితుల కుటుంబాలు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాయి. పోలీసులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరాయి. అంతేకాకుండా నిందితుల కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇచ్చేలా చూడాలని అభ్యర్థించాయి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా వాటిపై విచారణ జరిపేందుకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసును ఆరు నెలల్లోగా విచారణ జరిపి కోర్టుకు నివేదిక అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇతర కోర్టులు, సంస్థలు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విచారణను జరపవద్దని స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/