సంచలన నిజాలను బయటపెట్టిన దిశ నిందితులు

వాంగ్మూలంలో వెల్లడించిన షాకింగ్‌ విషయాలు!

Four accused in Disha case
Four accused in Disha case

హైదరాబాద్‌: దిశ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో కొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. దిశ నిందితులు కేసు విచారణలో సంచలన నిజాలను వెల్లడించినుట్లు సమాచారం. నిందితులు దిశపై అత్యాచారం చేయడానికి ముందు మరో 9 మంది మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ అరిఫ్‌ ఆరుగురిని హతమార్చగా, చెన్నకేశవులు ముగ్గురిని హత్య చేసినట్లు చెప్పారు. అత్యాచారం అనంతరం హత్య చేసి మృతదేహాలను దహనం చేసినట్లు వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ ఘటనలన్ని హైదరాబాద్‌, కర్ణాటక, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్లు నిందితులు అంగీకరించారని సమాచారం. కాగా నిందితుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో మొత్తం 15 ఘటనలు జరిగినట్లు గుర్తించారు. కోర్టుకు సమర్పించననున్న చార్జీషీట్‌లో నిందితులు వెల్లడించిన నేరాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపర్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దిశ నిందితుల డిఎన్‌ఏను మృతి చెందిన వారి డిఎన్‌ఏతో విశ్లేషిస్తున్నారు పోలీసులు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/