దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విచారణ వాయిదా

High Court of Telangana
High Court of Telangana

హైదరాబాద్‌: దిశ అత్యాచారం దేశ ప్రజలను విస్తుపోయేలా చేసింది. ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కాగా సుప్రీంకోర్టులో నేడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు విచారణను వాయిదా వేసింది. విచారణను ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభిస్తామని న్యాయస్థానం తెలిపింది. కాగా ఈ కేసులో ఎన్‌కౌంటర్‌కు గురైన నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలో 13వ తేదీ వరకు భద్రపరచాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/