దిశ నిందితుడు చెన్నకేశవులు భార్యకు 13 సంవత్సరాలే

chennakesavulu wife
chennakesavulu wife

హైదరాబాద్‌: దిశ అత్యాచార నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య మైనర్‌ అని తేలింది. చెన్నకేశవులు భార్య వయసు 13ఏళ్లని అధికారులు జరిపిన విచారణలో తేలింది. నారయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం శుక్రవారం గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపింది. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. ఆమె పుట్టింది 15-06-2006గా ఉంది. ఆమె ప్రస్తుతం 6నెలల గర్భవతి కూడా. దింతో చెన్నకేశవులు తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు ఆమె మైనర్‌ కావడంతో బాలల సదనంలో ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆమె గర్భిణి అని, సదనానికి పంపబోమని చెన్నకేశవులు తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం బాబాయి ఇంట్లో ఉంటున్న బాలిక చెల్లెలు, తమ్ముడినైనా పంపించాలని కోరగా తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తామని చెల్లులును పంపమని ఆమె బాబాయి అధికారులకు తెలిపారు. బాధిత బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ ఇంట్లో ఉంటోంది. చెన్నకేశవులును ప్రేమించి పెళ్లాడిన తర్వాత అత్తగారింటికి వచ్చింది.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/