వ్యాధులు – రకాలు

ఆరోగ్యం-పరిరక్షణ

వ్యాధులు - రకాలు
sickness

డిసీజ్‌ అనేది అబ్‌నార్మల్‌ మెడికల్‌ కండీషన్‌. ఇది శరీరంలోని ఒక భాగం లేదా అవయవం లేదా సిస్టమ్‌ ఇన్ఫెక్షన్‌. ఇన్‌ఫ్లయేషన్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్యాక్టర్స్‌, జెనిటిక్‌ ఫ్యాక్టర్స్‌ వంటి బాహ్య, అంతర్గత కారణాల వల్ల వస్తుంది.

దీనిఫలితంగా శరీరంలోని మార్పులు వ్యాధి లక్షణాలుగా బహిర్గతమవుతాయి. దీన్ని మనం వ్యాధిగా పరిగణిస్తాం.

దీన్నే ఇల్‌నెస్‌, సిక్‌నెస్‌, జబ్బు, రోగంగా వ్యవహరిస్తారు. లాటిన్‌లో మార్బస్‌, ఫ్రెంచ్‌లో మలడే, జర్మన్‌లో కాన్‌హైట్‌, స్పానిష్‌లో ఎన్‌ఫెర్‌మెడడ్‌, ఇంగ్లీష్‌లో డిసీజ్‌ అని అంటారు.

వ్యాధులు ఎలా వస్తాయో తెలుసుకునే శాస్త్రాన్ని పాథలాజీ అని అంటారు.

వ్యాధి ఏవిధంగా కల్గుతుందో దాని మెకానిజమ్‌ని తెలుసుకోవడాన్ని పాథోజెనిసిస్‌ అంటారు. పాథోసిస్‌ అంటే డిసీజ్‌ లేదా వ్యాధి అని అర్థం.

దీనివల్ల శరీరంలో నెగటివ్‌ ఎఫెక్ట్స్‌ ఏర్పడి అవయవపరంగా, ఫంక్షనల్‌గా, మెటాబాలన్‌గా మార్పులు ఏర్పడి దాని

ఫలితంగా లక్షణాలు వివిధ వ్యాధుల రూపంలో ప్రస్ఫుటంగా కనిప్తాయి.

వివిధ రూపాలు :
డిస్‌ఆర్డర్‌ అనేది డిస్టర్బెన్స్‌ లేదా ఫంక్షనల్‌ అబ్‌నార్మలీటీ అని చెప్పవచ్చు. బాహ్యంగా వచ్చే ఇన్ఫెక్షన్‌ ఏజెంట్స్‌ ద్వారా రాదు. ఇది మెంటల్‌, ఫిజికల్‌, జెనిటిక్‌, ఎమోషనల్‌, ఫంక్షనల్‌, బిహేవియర్‌ డిస్‌ఆర్డర్స్‌గా ఎక్కువ్ఞగా బహిర్గతమవ్ఞతాయి.

 • ఇల్‌నెస్‌: ఇల్‌నెల్‌ అనేది రోగి పర్సనల్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఉదా: నీరసం, ఆకలి లేకపోవడం, వళ్లునొప్పులు, నిద్రపట్టకపోవడం, డిప్రెషన్‌, ఆందోళన మొదలైనవి. ఇవి సబ్‌క్లినికల్‌గా ఎసింప్టమాటిక్‌గా ఉంటాయి.
 • ప్రీడిసీజ్‌: డిసీజ్‌ రావడానికి ముందు ఏర్పడే స్థితి ఇది సబ్‌ క్లినికల్‌గా లేదా ప్రోడ్రోమల్‌ స్టేజ్‌గా ఉంటుంది.

ఉదా: ప్రీ డయాబెటిస్‌, ప్రీహైపర్‌టెన్షన్‌. దీన్ని రెస్ట్‌, ఫిజికల్‌ ఎక్స్‌ర్‌సైజ్‌, ఆహారంలో, లైఫ్‌స్టయిల్‌లో మార్పులు, స్ట్రెస్‌ రిలాక్సేషన్స్‌ ద్వారా వ్యాధి బైటపడక ముందేనయం చేసుకోవచ్చు.

 • లీజన్స్‌: అన్‌హెల్తీ డిసీజ్‌డ్‌ స్టేట్‌ అని చెప్పాలి. ఉదా: స్కీన్‌లీజన్స్‌ (చర్మవ్యాధులు-లైకన్‌ప్లానస్‌) మెంటల్‌ లీజన్స్‌ (స్క్రీజోఫ్రెనియా, ఆంగ్జెటీన్యూరోసిస్‌.
 • ఇ. సిండ్రోమ్‌: ఇది ఒక వ్యాధికారి. వివిధ వ్యాధుల ఫలితంగా కలిగే లక్షణాల సమూహం. అనగా అనేక వ్యాధుల సమాహారం అని చెప్పాలి. ఉదా: టర్నర్‌ సిండ్రోమ్‌, డేన్‌సిండ్రోమ్‌, అక్యూట్‌ కొరనరీ సిండ్రోమ్‌, పాల్కిన్‌సోనియన్‌ సిండ్రోమ్‌ మొదలైనవి.
వ్యాధులు - రకాలు
Diseases – Types

పాథలాజికల్‌ స్టేట్‌:

వివిధ బాహ్యకారణాలైన బాక్టీరియా, వైరస్‌, ఫంగై, ప్రోటోజోవా వంటి సూక్ష్మక్రిములవల్ల కలిగే అబ్‌నార్మల్‌ పరిస్థితి.

 • డిస్‌ఎబిలిటీ: శరీరంలో కలిగే అననుకూల పరిస్థితి. ఉదా: బలహీనత, కడుపుబ్బరం, వికారం, నొప్పి

మార్టిడిటీ:
ఇది లాటిన్‌ పదం. మార్చిడస్‌ నుండి వచ్చింది. ఇది అన్‌హెల్తీ డిసీజ్‌డ్‌ స్టేజ్‌. ఒక ప్రాంతం, కమ్యూనిటీలో ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారో అంచనా వేయడం.

 • సిక్‌నెస్‌: ఇది వ్యాధి, అనారోగ్య పరిస్థితిని లెలుపుతుంది. దేహారోగ్యం చెడిపోవడం లేదా, జబ్బుపడడం. ఇది చిన్న వ్యాధుల నుండి పెద్ద వ్యాధుల వరకు ఏర్పడేస్థితి.

డెస్ట్రెస్‌:
మితిమీరిన బాధ లేదా నొప్పి లేదా అనీజీనెస్‌ని తెలుపే పరిస్థితి. ఉదా: నొప్పి, దుఃఖం, మానసిక వ్యధ.

 • డిస్‌ఎబిలిటీ: శరీర (నార్మల్‌) బాహ్యఅంతర్గత పరిస్థితికి ప్రతిబంధకం ఏర్పడడం.

డిస్‌హార్మోనీ:

అబ్‌నార్మల్‌ ఫిజికల్‌, ఫంక్షనల్‌ ఛేంజ్స్‌. ఇలా వ్యాధి వివిధపేర్లతో వ్యవహరింపబడుతుంది.

క్రానిక్‌ డిసీజెస్‌: ఇవి లాంగ్‌టర్మ్‌ డిజీజెస్‌. పీరియడ్‌కల్‌గా, కంటిన్యూగా, తరచుగా, ఆగిఆగి రావడం.. ఇవి వారాలు, నెలలు, సంవత్సరాలుంటాయి.

వీటివల్ల బాధపడేవారిని దీర్ఘకాలిక రోగులు అంటారు. ఒక్కోసారి జీవితాంతం ఉండి బాధపడాల్సి ఉంటుంది .

ఉదా: డయాబెటిస్‌, గుండె, కిడ్నీ వ్యాధులు. వ్యాప్తి: గాలి, నీరు, ఆహారం ద్వారా, స్పర్శ, కీటకాలు, క్రిముల వల్ల సెక్స్‌వల్ల ఒకరి నుండి మరొకరికి వ్యాధులు వ్యాపిస్తాయి.

రోజుకి 150,000 మంది వ్యాధుల బారిన పడుతున్నారు.

రోజుకి 100,000 మంది 2/3 మంది కాంప్లికేషన్‌ లేదా మరణించడమో జరుగుతుంది.
వ్యాధిరకాలు: వ్యాప్తి చెందే కారణాన్ని ఇవి 5 రకాలుగా విభజించవచ్చు.

 • ఎయిర్‌బర్న్‌ (గాలి) డిసీజెస్‌ం స్వైన్‌ఫ్లూ, సార్స్‌-కొవిడ్‌-19,
 • ఫుడ్‌ బర్న్‌ (ఆహారం) డిసీజెస్‌: టైఫాయిడ్‌
 • ఇన్ఫెక్టివ్‌ డిసీజెడ్‌: ఇవి రెండువిధాలు
  అంటువ్యాధులు, జలుబు, ఫ్లూ, కమ్యూనికెబుల్‌ డిసీజెస్‌, మలేరియా.
వ్యాధులు - రకాలు

-డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/