లోక్‌ సభలో కియా మోటార్స్‌ అంశంపై చర్చ

లోక్ సభలో కియా మోటార్స్ అంశాన్ని ప్రస్తావించిన టిడిపి ఎంపిలు

KIA Motors India Anantapur Factory
KIA Motors

న్యూఢిల్లీ: లోక్‌ సభలో ఏపి నుండి నుంచి కియా మోటార్స్ తరలిపోతోందంటూ ప్రఖ్యాత రాయిటర్స్ సంస్థ ప్రచురించిన కథనంపై కూడా చర్చజరిగింది. టిడిపి ఎంపిలు ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. వారిని వైఎస్‌ఆర్‌సి ఎంపిలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, కియా మోటార్స్ తరలిపోతోందంటూ టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కియా పరిశ్రమ తరలిపోదని… అనంతపురం జిల్లాలోనే ఉంటుందని చెప్పారు. ఇదే విషయాన్ని కియా ఎండీ స్వయంగా ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ సంస్థకు గత చంద్రబాబు ప్రభుత్వం రూ. 30 కోట్ల పెట్టుబడికి వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చిందని… ఈ విషయాన్ని తాము ప్రశ్నిస్తే కియా మోటార్స్ తరలిపోతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/