‘మిత్‌బస్టర్స్‌’ యాంకర్‌ గ్రాంట్‌ ఇమహారా కన్నుమూత

‘డిస్కవరీ’ ప్రతినిధి వెల్లడి

Discovery Channel anchor Grant Imahara dies
Discovery Channel anchor Grant Imahara

డిస్కవరీ చానల్‌లో ప్రముఖ షో ‘మిత్‌బస్టర్స్‌’ యాంకర్‌ గ్రాంట్‌ ఇమహారా(49) మంగళవారం కన్నుమూశారు.

ఈ విషయాన్ని డిస్కవరీ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు.

‘గ్రాంట్‌ మరణం విచారకరం. అతడు మా డిస్కవరీ కుటుంబంలో ముఖ్యమైనవాడు. అతడు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.’ అని పేర్కొన్నారు.

కాగా, ఇమహారా ఆకస్మిక మృతికి కారణాలు తెలియలేదు. అతడు ‘మిత్‌ బస్టర్స్‌’ ప్రోగ్రాంకు యాంకరింగ్‌ చేశాడు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/