ఈ కారుపై బంపరాఫర్స్‌ రూ.40వేల వరకూ తగ్గింపు

మహీంద్రా మరాజ్జోపై డిస్కౌంట్లు

Mahindra Marazzo
Mahindra Marazzo

ముంబై: దీపావళి తర్వాత కూడా ఆటో కంపెనీ తమ కార్లపై వినియోగదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మహీంద్రా మరాజో కారు కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో మార్కెట్లో కొనసాగుతోంది.

మీరు మహీంద్రా మరాజ్జోను కొనుగోలు చేస్తే, మీరు 40,200రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు.

ఇది కాకుండా, ఈ కారుపై కార్పొరేట్‌ డిస్కౌట్లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్లు, వినియోగదారు పథకాలు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

బిఎస్‌6 ఇంజిన్‌తో కొత్త మరాజో రూ.11.25లక్షలతో ప్రారంభమవుతోంది. ఈ ధర మహీంద్రా మరాజో యొక్క ఎం2 వేరియంట్‌.

అదే సమయంలో దాని ఎం4ప్లస్‌ వేరియంట్‌ ధర రూ.12.37లక్షలు. కాగా ఎం6ప్లస్‌ టాప్‌ వేరియంట్‌ ధర రూ.53.51లక్షలు. ఢిల్లీలో ఎక్స్‌ షోరూమ్‌ ధరలు.

మహీంద్రా మరాజో ఎం2, ఎం4ప్లస్‌ వేరియంట్లలో 16 అంగుళాల చక్రాలు 215/65సెక్షన్‌ టైర్లతో ఉన్నాయి.

టాప్‌ ఎం6ప్లస్‌ వేరియంట్లలో 17 అంగుళాల చక్రాలు 215/60సెక్షన్‌ టైర్లతో చుట్టబడి ఉన్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/