డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు

 Disco Raja shooting to end
A still from Disco Raaja

తాజా ‘నాడి వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శరవేగంగా హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది..తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో S. P. బాల సుభ్రమణ్యం పాట పాడారు.. ఈ సాంగ్ పూర్తిగా రెట్రో ఫీల్ ని కలిగిస్తుంది..ఈ సాంగ్ లో లిరిక్స్ చాలా వాల్యూ తో కూడినవిగా విన్నవారంతా చెప్పటం విశేషం..అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ అతి త్వరలో విడుదల చేస్తారు..

తాజా ‘నాడి’వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/