రెండో విడత వైఎస్‌ఆర్‌సిపి వాహనమిత్ర పథకం ప్రారంభం

Disbursement of VAHANAMITRA 2nd Phase by Hon’ble Minister for Civil Supplies at Vijayawada

విజయవాడ: ఏపిలో రెండో విడత వైఎస్‌ఆర్‌సిపి వాహనమిత్ర పథకాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది 2 లక్షల 61,975 మందికి వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా లబ్ధి చేకూరనుందని తెలిపారు. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా రెండేళ్లకి కలిపి రూ.510 కోట్లు పేదలకు అందిస్తున్నట్లు చెప్పారు. గతేడాది కంటే 40 వేలు మందికి ఈ ఏడాది లబ్ధి చేకూరిందని వెల్లడించారు. లబ్ధిదారులందరికీ రూ.10 వేలు అకౌంట్‌లో నేరుగా జమ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/