డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ప్రమాదం ..

కిక్ , సైరా చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రమాదానికి హురయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే చర్చ నడుస్తుంది. తాజాగా ఈయన కాలికి గాయమైనట్లు ఉన్న ఓ పిక్ బయటకు రావడం తో అంత కూడా సురేందర్ రెడ్డి కి ఏమైందని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి..అఖిల్ అక్కినేని తో ఏజెంట్ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూరైనప్పటికీ , మళ్లీ రీ షూట్స్ చేయడం తో సినిమా రిలీజ్ అలసమైంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు మేకర్స్ గతంలో తెలిపారు.

ఇదిలా ఉంటె తాజాగా సురేందర్ రెడ్డి కాలి గాయంతో వీల్ చైర్ లో కూర్చుని ఉన్నట్లు ఓ ఫోటో బయటకు వచ్చింది. దీంతో అభిమానులంతా సురేందర్ రెడ్డి కి ఏమైందని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ‘ఏజెంట్’ షూటింగ్ అవుతుండగా ఒక రాడ్ సురేందర్ రెడ్డి కాలు మీద పడి.. ఎడమ కాలుకి గాయం అయిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆయనని వెంటనే దగ్గరలో వున్న ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించినట్టుగా తెలిసింది. అయితే ఈరోజు శనివారం షూటింగ్ సమయంలో సురేందర్ రెడ్డి కెమెరా ముందు నుండి సూచన ఇవ్వడానికి లేచి ముందుకు వెళ్ళటంతో అక్కడే వున్న ఒక రాడ్ సురేందర్ రెడ్డి కాలు మీద పడిందని తెలిసింది. కాలు మీద పడింది కాబట్టి సరిపోయింది కానీ, ఇంకా తల మీద పడితే ఇంకా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని యూనిట్ సభ్యులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కాలుకి వెంటనే కట్టుకట్టి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని కూడా డాక్టర్లు చెప్పినట్టుగా తెలిసింది.

అఖిల్, మిగతా యూనిట్ సభ్యులు వెంటనే సురేందర్ రెడ్డి దగ్గరకి చేరుకోవటం, ఆ వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్ళటం జరిగిందని తెలిసింది. సురేందర్ రెడ్డి చక్రాల కుర్చీలో కూర్చొని వున్నాడు. సినిమా లేట్ అవ్వకూడదు అని సురేందర్ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాలని నిర్ణయించుకున్నాడని కూడా తెలిసింది. డాక్టర్స్ విశ్రాంతి అవసరం అన్నా, సురేందర్ రెడ్డి పని చెయ్యడానికే మొగ్గు చూపుతున్నాడట.