అమెరికా మీడియాలో దర్శక ధీరుడి ఫై కథనం

దర్శక ధీరుడు రాజమౌళి ఫై అమెరికా మీడియా కథనం ప్రచురించడం సినీ ప్రముఖులను , అభిమానులను ఆనందానికి గురి చేస్తుంది. బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా సత్తాను వరల్డ్ వైడ్ గా సాటి చెప్పిన రాజమౌళి , ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో మరో స్థాయికి చేరాడు. రాజమౌళి అంటే ఓ బ్రాండ్ అనేలా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు ఎంపిక కావడం రాజమౌళి డైరెక్షన్ కు నిదర్శనం.

గోవాలో జరుగుతున్న ఇఫీ చలనచిత్రోత్సవంలో ఆర్ఆర్ఆర్ ప్రదర్శిస్తున్నారు. కాగా, ఆస్కార్ అవార్డులకు ముందు ప్రదానం చేసే గవర్నర్ అవార్డుల కార్యక్రమం కోసం రాజమౌళి ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలో, అమెరికా మీడియాలో రాజమౌళిపై కథనం రావడం విశేషం. లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక ‘ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ముంగిట భారీ అవకాశాలు’ అంటూ రాజమౌళిపై కథనం ప్రచురించింది. ఎస్ఎస్ రాజమౌళి అమెరికన్ యాక్షన్ సినిమాలు చూస్తూ పెరిగాడని, ఇప్పుడు యావత్ అమెరికా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం చూస్తూ ఊగిపోతోందని తన కథనంలో పేర్కొంది.