మద్యం అమ్మకాలపై నేడు దిశా నిర్దేశం

నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం

Liquor sales

Amaravati: లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో 4 నుంచి రాష్ట్రంలోని గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభించాలని ప్రభుత్వం  నిర్ణయించింది

ఈ విషయంలో  నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.  అయితే మద్యం షాపులు మాత్రమే తెరవనున్నారు. బార్లపై ఆంక్షలు అలాగే కొనసాగుతాయి. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిపేలా ఏర్పాట్లు చేయనున్నారు.   జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే ఐదు జిల్లాలు రెడ్‌ జోన్‌లో ఉన్నందున అక్కడ అమ్మకాలు జరగవు. మండలాలను యూనిట్‌గా తీసుకుంటే అన్ని జిల్లాల్లోనూ రెడ్‌ జోన్‌ మండలాలను  మినహాయించి మిగిలిన మండలాల్లో మద్యం విక్రయించే అవకాశముంది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/