లీకుల ఎఫెక్ట్ : చిత్ర యూనిట్ ఫై సలార్ డైరెక్టర్ ఫైర్

కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ నెలలుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ చిత్రానికి లీకుల బెడద తలనొప్పిగా మారింది. కీలక వీడియోస్ , పిక్స్ ఇలా అన్ని కూడా లీక్ అవుతూ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. మొన్నటికి మొన్న సినిమాకు హైలైట్ గా నిలిచే ఓ ఫైట్ వీడియో లీక్ కాగా..ఇప్పుడు పిక్స్ లీక్ అయ్యాయి.

దీంతో చిత్ర యూనిట్ ఫై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక నుంచి సెట్‌లోకి మొబైల్స్ తీసుకురావద్దని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇలా అయిన లీకులకు చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కేజీఎఫ్ మూవీని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ చిత్రాన్ని నిర్మిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తు్న్నారు.