సుష్మా స్వరాజ్‌కు 51 దేశాల నివాళి

Sushma Swaraj
Sushma Swaraj

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుస్మాస్వరాజ్ మృతిపట్ల ఐరాసలో 51 దేశాల దౌత్యవేత్తలు నివాళులర్పించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సుష్మా ఫోటోకు నివాళులర్పించిన దౌత్యవేత్తలు.. అక్కడున్న పుస్తకంలో సంతాప సందేశం రాశారు. సంతాపం సందేశం తెలిపిన దేశాలు.. రష్యా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, స్విట్జర్లాండ్‌, అర్జెంటీనా, బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బోట్స్‌వానా, దక్షిణ కొరియా, ఈజిప్ట్‌, ఫిజి, జార్జియా, ఘానా, కెన్యా, మలేషియా, మాల్దీవులు, మల్టా, మయన్మార్‌, నేపాల్‌, న్యూజిలాండ్‌, సింగపూర్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌, ఇజ్రాయెల్‌, యుఎఇతో పాటు పలు దేశాల దౌత్యవేత్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వీడియోను యుఎన్‌లోని భారత అంబాసిడర్ సయీద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/