మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటుడికి సమన్లు

Dino Morea
Dino Morea

న్యూఢిల్లీ: స్టెర్లింగ్‌ బయోటెక్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు డినోమోరియా, ప్రముఖ డిజె అఖీల్‌కు ఈడి సమన్లు జారీ చేసింది. స్టెర్లింగ్‌ బయోటెక్‌ వ్యవహారంలో వీరిద్దరికి కూడా సొమ్ములు అందినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు నిమిత్తం ఈడి సమన్లు జారీ చేసింది.
పలు బ్యాంకులను వేల కోట్లకు మోసగించినట్లు ఆరోపణలు రావడంతో గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ స్టెరిలైట్‌ బయోటెక్‌, ఆ కంపెనీ ప్రమోటర్లపై మోసం, మనీలాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. స్టెర్లింగ్‌ గ్రూపు ప్రధాన ప్రమోటర్లు రుణంగా తీసుకున్న నిధుల్ని నైజీరియాలోని తమ చమురు వ్యాపారానికి మళ్లించడమే కాకుండా వ్యక్తిగత అవసరాలకూ వాడుతున్నారని ఈడి తెలిపింది.ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/