ట్రంప్‌తో విందు.. సిఎం జగన్‌కు అందని ఆహ్వానం

AP CM Jagan and Donald Trump
AP CM Jagan and Donald Trump

అమరావతి: భారత్ లో పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు రానుండగా, 25న రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయన గౌరవార్థం, రామ్ నాథ్ కోవింద్ ఇస్తున్న విందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందలేదు. ఈ విందుకు రావాలని 8 మంది ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందగా, అందులో కేసీఆర్ పేరు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. కాగా ఈ విందుకు దాదాపు 90 మందికి ఆహ్వానం అందినట్టు సమాచారం. కేసీఆర్ తో పాటు అసోం, హరియాణా, కర్ణాటక, బిహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. బీజేపీ కూటమి పాలిత రాష్ట్రాలు, తటస్థులకు మాత్రమే వ్యూహాత్మకంగా ఆహ్వానాలు వెళ్లాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ నుంచి అధీర్ రంజన్ చౌధురి, గులాంనబీ ఆజాద్ లను రాష్ట్రపతి ఆహ్వానించగా, తమ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీని పిలవలేదన్న కారణంతో విందుకు తాను హాజరు కాబోనని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/