ఏపీ సినిమా టికెట్స్ ధరల విషయంలో ఎవరు మాట్లాడొద్దంటూ హీరోలకు దిల్ రాజు రిక్వెస్ట్

ఏపీ సినిమా టికెట్స్ ధరల విషయంలో ఎవరు మాట్లాడొద్దంటూ హీరోలకు దిల్ రాజు రిక్వెస్ట్ చేసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్స్ ధరల వ్యవహారం చిత్రసీమలోనే కాదు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది. సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించడం తో పాటు థియేటర్స్ ఫై తనిఖీలు చేస్తుండడం తో చాల థియేటర్స్ సీజ్ అవుతున్నాయి. కొంతమంది థియేటర్స్ యాజమాన్యం ప్రభుత్వం తెలిపిన టికెట్ ధరలకు థియేటర్స్ నడపలేమని స్వచ్ఛదంగా థియేటర్స్ మూసి వేయగా..ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని అధికారులు థియేటర్స్ ను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరల పట్ల పలువురు హీరోలు , నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సైతం ఎదురుదాడి చేసారు. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పటు చేసారు. ఏపీ ప్రభుత్వం, సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తామని దిల్ రాజు అన్నాడు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది.. మళ్లీ పాత రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంత వరకు ఎవ్వరూ కూడా వ్యక్తిగతంగా స్పందించొద్దని సూచించారు. సపరేట్‌గా ఓ కమిటీ వేస్తున్నాం.. అందులో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారని చెప్పుకొచ్చారు. ఆ కమిటీ నిర్ణయం తరువాత మళ్లీ మాట్లాడతాను అని దిల్ రాజు అన్నారు. కష్టమో నష్టమో ముందుకే వెళ్తాం.. సినిమాలను ఆపుకోలేమని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచడం ఫై దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.