మరో ప్రొడక్షన్ హౌస్ ను ప్రకటించిన దిల్ రాజు

Dil Raju
Dil Raju

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో ప్రొడక్షన్ హౌస్ ను ప్రకటించారు. ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థ ఉండగా..ఇప్పుడు తన పేరు మీదే దిల్ రాజు ప్రొడక్షన్స్ (డీఆర్పీ) పేరుతో కొత్త సంస్థను ప్రకటించారు. అయితే ఈ నూతన ప్రొడక్షన్ హౌస్ కార్యకలాపాలను తన కుమార్తె హన్షిత రెడ్డి చూసుకుంటుందని తెలిపారు. డీఆర్పీ బ్యానర్ పై ప్రయోగాత్మక చిత్రాలు నిర్మిస్తామని , చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్నదే కొత్త బ్యానర్ ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఈ బ్యానర్ లో ముందుగా బలగం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనికి జబర్దస్త్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడని తెలిపారు.

ఇక ప్రస్తుతం దిల్ రాజు వారసుడు మూవీని నిర్మించారు. తమిళ్ హీరో విజయ్ హీరోగా నటిస్తుండగా , రష్మిక హీరోయిన్. వంశీ పైడిపల్లి డైరెక్టర్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో ఏక కాలంలో విడుదల అవుతుంది.