సమ్మె విరమణపై కార్మికుల్లో విభేదాలు

TSRTC strike
TSRTC strike

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మె విరమణపై కార్మిక యూనియన్ల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహించిన నేతలు ఏం సాధించారనే విమర్శలు ఇతర యూనియన్ల నుండి వెల్లువెత్తుతున్నాయి. మొత్తం ఆర్టీసిలో 11 యూనియన్లు ఉంటే… కేవలం మూడు సంఘాలే జేఏసిని ఏర్పాటు చేసుకున్నాయని కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని దీంతో సమ్మె కార్మికులకు అన్యాయం జరిగిందని పలువురు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జేఏసి కో కొన్వినర్‌గా ఉన్న హన్మంతు విమర్శించారు. 48 రోజుల సమ్మెలో జేఏసి వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. ప్రధాన డిమాండ్ అయిన, విలీనాన్ని పక్కన పెట్టడడం కార్మికులకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించారు. ఇక సిఎం పెట్టిన డెడ్‌లైన్‌ అనంతరం విధుల్లో చేరిఉంటే ఇంతమంది ప్రాణాలు బలి అయ్యోవి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అశ్వాత్థామ రెడ్డి సరైన సమయంలో స్పందిచక పోవడం వల్లే సమస్యలు పేరుకుపోయాయని ఇతర కార్మికులు విమర్శలు చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh