విజనరీ లీడర్‌కి పాయిజన్‌ లీడర్‌కి తేడా ఏంటో తెలుసా?

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ను టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శించారు. పాయిజన్‌ లీడర్‌కి, విజనరీ లీడర్‌కి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా? రాబోయే సంక్షోభాన్ని ముందే పసిగట్టి నివారణ చర్యలు తీసుకునే వారిని విజనరీ లీడర్‌ అంటారు. అలా చంద్రబాబు ఆలోచనల్లోంచి పుట్టిందే పట్టిసీమ అన్నారు. ఎన్ని వరదలు వచ్చినా నీటిని వినియోగించుకోకుండా సముద్రంపాలు చేసేవాడిని పాయిజన్‌ లీడర్‌ అంటారని జగన్‌ ఉద్ద్యేశించి ఎద్దేవా చేశారు. పైనుండి ఎంత వరద వచ్చినా రాష్ట్రంలో నీటి అవసరాలను తీర్చలేకపోయారని అన్నారు. పనికిరాని పట్టిసీమ అన్నవారే మోటార్లు ఆన్‌ చేస్తున్నారని హేళన చేశారు. వరదలు వచ్చినప్పుడే మోటార్లు ఆన్‌ చేసి ఉంటే నీటికోత ఏర్పడి ఉండేదికాదని, ముందుచూపు లేని జగన్‌ సర్కారు మూలంగా ఈ పరిస్థతి ఎదురైందని నారా లోకేశ్‌ విమర్శించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/