కన్నాగారు రాజధాని కనిపించిందా..?

లేదా గ్రాఫిక్స్‌ చూసి భ్రమపడ్డారా..?

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణపై విజయసాయిరెడ్డి సైటైరికల్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పాలకులు మారితే రాజధాని మారుతుందా అని కన్నా లక్ష్మీనారయణ గారు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. రాజధాని ఎక్కడుందో కనిపించిందా? లేదా గ్రాఫిక్స్‌ చూసి భ్రమపడ్డారా? అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడికి సపోర్టుగా మీరెంత వాదించినా పార్టీ అధ్యక్షుడిగా తన మనిషిని నియమించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న పైరవీలు ఆపడని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/