బిజెపిపై విరుచుకపడ్డ ఉద్ధవ్‌ ఠాక్రే

మేం బిజెపిని ఏం అడిగాం… నింగి నుంచి చంద్రుడ్ని తీసుకురమ్మన్నామా? లేక చుక్కల్ని తీసుకురమ్మన్మామా?

Uddhav Thackeray
Uddhav Thackeray

ముంబయి: మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే మరోసారి బిజెపి పై మండిపడ్డారు. శివసేన అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలకు కారణం బిజెపినే అని స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేయడం ఎలా అనైతికం అవుతుందని ప్రశ్నించారు. గతంలో బిజెపి పొత్తుపెట్టుకోలేదా? అని నిలదీశారు. ఖిఅయినా మేం బీజేపీని ఏం అడిగాం… నింగి నుంచి చంద్రుడ్ని తీసుకురమ్మన్నామా? లేక చుక్కల్ని తీసుకురమ్మన్మామా?… మా తండ్రి గారి కోరిక మేరకు ఓ శివసైనికుడ్ని సీఎం చేయమని అడిగాంఖి అంటూ బిజెపిపై విమర్శలు చేశారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే బిజెపితన మాట నిలబెట్టుకుని ఉంటే ఇవాళ తన స్థానంలో మరో శివ సైనికుడు సీఎం అయ్యుండేవాడని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎం పీఠం వద్ద సయోధ్య కుదరక శివసేనకు బిజెపి దూరమైన సంగతి తెలిసిందే. ఆపై శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/