వజ్రాల మెరుపుల సంగతులు

వజ్రాల అందం, ఆకర్షణ వాటి మెరుపులో ఉంటుంది. కాబట్టే వజ్రాల నగల ఎంపికలో రాళ్ల మెరుపుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకు వజ్రాల కలర్ గ్రేడింగ్ మీద కూడా అవగాహన పెంచుకోవాలి. వజ్రాల రంగు గ్రేడింగ్ ‘డి మొదలుకుని ‘ఎమ్ వరకు ఉంటుంది. గ్రేడ్ వజ్రాల మెరుపు స్పష్టంగా ఉంటుంది. గ్రేడ్ తగ్గే కొద్ది తెలుపు రంగు పసుపు రంగుకు మారుతూ ఉంటుంది.
డి ఆ తర్వాత ‘ఇ, ‘ఎఫ్ గ్రేడ్ వజ్రాలు కూడా బాగుంటాయి. ప్రస్తుతం మనదగ్గర ఈ గ్రేడ్లు రెండూ విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. ఒక కేరట్ ఇ, ఎఫ్ రకం గ్రేడ్ వజ్రాల ధర యాభై వేల పైనే ఉంటుంది. డి రకం వజ్రాల ధర కేరట్‌కు అరవై అయిదు వేల వరకు ఉంటుంది.
అందుకే ఇ, ఎఫ్ రకం వజ్రాలకే ఆదరణ ఎక్కువ. వజ్రాలకు నూటికి నూరు శాతం మార్పిడి ఉంటుంది. ఇ, ఎఫ్ రకం వజ్రాలతో తయారైన చిన్న నగలు కొంటే మంచిది. సాలిటైర్స్లో ఇ, ఎఫ్‌తో పాటు జి వరకూ రంగులు బాగుంటాయి. క్లోజ్ సెటింగ్ డైమండ్స్‌లో రాళ్ల అడుగున సిల్వర్ వేస్తారు కాబట్టి రాళ్లు మెరుస్తాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/