డైమండ్‌ జాకెట్‌ కుట్టేవిధానం

డైమండ్‌ జాకెట్‌ కుట్టేవిధానం

దీనికి ఫ్రంట్‌, బ్యాక్‌ పాత బ్లౌజ్‌ కొలతలే, చేతులు కూడా అదే ప్రకారం కట్‌ చేసుకోవాలి. కాకపోతే దీనికి స్క్వేర్‌నెక్‌ దగ్గర డైమండ్‌ షేపులో ముక్కలను తయారు చేసుకొని తర్వాత మెడ పట్టీని జాయింట్‌చేసి లోపలికి హెమింగ్‌ చేసుకోవాలి. ఆ డైమండ్‌ ముక్కలు ఎలా అన్నది కింద గమనించండి. డైమండ్‌ ముక్క చెయ్యటానికి ఒకటిన్నర అంగుళం పొడవు, వెడల్పులతో దాదాపు 15 ముక్కలు కట్‌ చేసుకోవాలి. ఒక్కొక్క ముక్కని తీసుకొని పైన కటింగ్‌లో చెప్పిన ప్రకారం ఫోల్డ్‌ చేయాలి. ఇలా 15 ముక్కలను ఈ షేప్‌లోకి తెచ్చి చివరలను అంచుల దగ్గర మడత పోకుండా కుట్టువేసుకొని ఉంచుకోవాలి. 15 ముక్కలని విడివిడిగా ఈ విధంగా తయారు చేసి ఉంచుకోవాలి.

మెడపట్టీ కుట్టేటప్పుడు భుజం దగ్గర మొదటి ముక్కను పెట్టాలి. దాని మీద మెడపట్టీ పెట్టాలి. అప్పుడు ఒక కుట్టువేయాలి. తర్వాత రెండో డైమండ్‌ ముక్కను తీసుకొని మొదటి ముక్కను ఆనుకొని మధ్యలో ఖాళీ లేకుండా ఇంచుమించు కొసలు రెండు ఒకదానిమీద ఒకటి వచ్చేటట్లుగా పెట్టుకొని పైన మెడపట్టీని దాని మీద పెట్టుకొని మిగితా మక్కలను కూడా అదేవిధంగా పెట్టుకుంటూ మెడ పట్టీని సరిచూసుకుంటూ రెం డో భుజం వరకు ముక్కలను పెట్టుకుంటూ మెడపట్టీని కుట్టాలి.

మెడ పట్టీకి పైకుట్టు వేసేటప్పుడు డైమండ్‌ ముక్కలను జాకెట్‌ వైపుకి తిప్పి మెడపట్టీని లోపలివైపుకు తిప్పి కుట్టువేయాలి. మొగ్గ మోడ్రన్‌ జాకెట్‌ ఈ మోడ్రన్‌ జాకెట్‌కి కూడా డైమండ్‌ జాకెట్‌ లాగే స్క్వేర్‌నెక్‌ దగ్గర తయారు చేసిన మొగ్గలను అతకటమే. మొగ్గలను తయారు చేసు కోవటం చూద్దాం. ఒకటిన్నర అంగుళాల పొడవు, వెడల్పులతో 15 ముక్కలను కట్‌ చేసుకోవాలి. ముందు ముక్కను తీసుకొని దానిని డైమండ్‌ ముక్కని ఫోల్డ్‌ చేసినట్లుగా ఒక మడతే వేయాలి. తర్వాత అంచులను సూదిదారంతో చుట్టూ టాకాలు వెయ్యాలి.వేసిన తర్వాత దారం కొననుపట్టుకొని క్లాత్‌ దగ్గరకి లాగుతూ మొగ్గ షేప్‌లోకి తేవాలి. తర్వాత అడుగున మడతలు పోకుండా కుట్టువేయాలి.

ఇదే విధంగా 15 ముక్కలను తయారు చేసుకోవాలి. కుట్టేటప్పుడు దీనికి కూడా భుజం దగ్గర్నుంచి డైమండ్‌ ముక్కలను అతుకు వేసినట్టుగా ఒకదాని ప్రక్కన ఒకటి పెట్టుకుంటూ పైన మెడపట్టీని సర్దుకుంటూ రెండో భుజం దాకా మొగ్గలు పెట్టుకొని మెడను పూర్తిచెయ్యాలి.

దీనికి పైకుట్టు కుట్టేటప్పుడు మొగ్గని కూడా కలిపి కుట్టాలి. నెక్‌ మోడల్‌ జాకెట్‌ ఇక్కడ రకరకాల నెక్‌ మోడల్స్‌ ఇస్తున్నాం. వీటిని పంజాబీ డ్రస్సులకి, బ్లౌజులకి వాడొచ్చు. గతంలో ఇచ్చిన బ్లౌజు కొలతలతోని వెనుక భాగాన్ని తీసుకొని దాన్ని రెండుమడతలు వేసి దాని మీద మీకు నచ్చిన మోడలడిజైన్‌ గీసుకొని, దాని ప్రకారం కట్‌చేసుకొని కుట్టుకోవాలి.

మెడకి ముక్కను అతుకు వేసేటప్పుడు కట్‌ చేసిన ముక్కను వేరే ముక్కమీద పెట్టుకొని దాని ప్రకారం ఆ మెడను కట్‌ చేసి ఆ ముక్కను జాకెట్‌ మీద పెట్టుకొని కుడిభాగం అతికిన దాన్ని లోపలికిమడచి లోపలికి వచ్చేలా పైకుట్టు వేసుకొని హెమింగ్‌ చేసుకోవాలి. మెడను కత్తిరించేటప్పుడు అంగుళాలను ముందుగానే బ్లౌజు మీద గుర్తు పెట్టుకొని ఆ ప్రకారం కట్‌ చేసుకోవాలి.

పంజాబీ డ్రస్సులకి కూడా ఇదే విధంగా కత్తిరించి కుట్టుకోవాలి. మేం ఇచ్చిన వేరే మోడల్స్‌లో కొన్ని జాకెట్స్‌కి, మరికొన్ని పంజాబీ డ్రస్సులకి నప్పుతాయి. మీ ఇష్ట ప్రకారం కుట్టుకోవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:  https://www.vaartha.com/news/international-news/