ధోని రిటైర్మెంట్‌పై ట్విటర్‌లో హ్యాష్‌ ట్యాగ్‌…

Dhoni
Dhoni

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్‌లో ఎక్కువగా చర్చకు దారితీస్తున్న అంశం ధోని రిటైర్మెంట్‌ ఎప్పుడు? ఇంగ్లాండ్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌ అనంతరం ధోని ఇప్పటివరకు మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత తొలి రెండు నెలలు ఆర్మీకి సేవలందించాలనే ఉద్ధేశ్యంతో రెండు నెలలు క్రికెట్‌కు విరామమిచ్చాడు. ఆర్మీ ట్రైనింగ్‌ ముగిసిన అనంతరం కూడా ధోని తిరిగి టీమిండియాలో చేరలేదున. అయితే ధోని తనంతట తాను ఆడటం లేదా లేక సెలక్టర్లే అతడిని పక్కకు పెడుతున్నారా అనే ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి. ఇక ధోని వీడ్కోలుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్‌లో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం అనూహ్యంగా ట్విటర్‌లో ధోని రిటైర్మెంట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ధోని సాధించిన ఘనతలు, రికార్డులను గుర్తుచేస్తూ రిటైర్మెంట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు. దీనితో పాటు థ్యాంక్యూ ధోని అనే మరో హ్యాష్‌ ట్యాగ్‌ కూడా తెగ ట్రెండ్‌ అవుతోంది. దీంతో ధోని అభిమానులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. అయితే జార్ఖండ్‌ డైనమైట్‌ వీడ్కోలు వార్తలను ఖండిస్తున్నారు. అంతేకాకుండా అతడికి మద్ధతుగా నిలుస్తూ నెవర్‌ రిటైర్‌ ధోని హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/