ధోనీ రిటైర్‌ అయి తమతో పాటు ఇంట్లో ఉండాలి

MS Dhoni
MS Dhoni

హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌ గురించి ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌తోనే ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తాడని అంద‌రూ అనుకున్నారు. అయితే ధోనీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. జులై మూడు నుంచి జ‌రుగనున్న విండీస్ టూర్‌కు జ‌ట్టును ఎంపిక చేయ‌డానికి శుక్ర‌వారం సెలెక్ష‌న్ క‌మిటీ స‌మావేశం కానుంది. ఈ నేప‌థ్యంలో ధోనీ భ‌విత‌వ్యం గురించి చ‌ర్చ మొద‌లైంది. అయితే ఈ సందర్భంగా ధోనీ కోచ్ కేశ‌వ్ బెన‌ర్జీ ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల‌ని అత‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటున్న‌ట్టు కేశ‌వ్ తాజాగా వెల్ల‌డించారు. గ‌త ఆదివారం నేను ధోనీ ఇంటికి వెళ్లి అత‌ని త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాను. ధోనీ ఇక క్రికెట్‌ను విడిచిపెడితే బాగుంటుంద‌ని వారు కోరుకుంటున్నారు. ధోనీ రిటైర్ అయి త‌మ‌తో పాటు ఇంట్లో ఉండాల‌ని వారు ఆశిస్తున్నారు. ధోనీ మ‌రో ఏడాది పాటు క్రికెట్ ఆడాల‌ని, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని నేను వారికి చెప్పాను. వారు మాత్రం ధోనీ వెంట‌నే క్రికెట్ నుంచి త‌ప్పుకుని ఇంటిని చూసుకోవాల‌ని కోరుకుంటున్నార‌్ఘని కేశ‌వ్ చెప్పారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/