ధోని అందుబాటులో ఉండడు!

dhoni
dhoni

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సెలక్షన్‌ కమిటీకి నవంబర్‌ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేడు. ఇటీవల ధోనీ గురించి భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పోస్టు చేసిన ట్విట్‌ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2016లో టి 20 ప్రపంచకప్‌ సందర్భంగా ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్‌లో ఓ సన్నివేశాన్ని కోహ్లీ పోస్ట్‌ చేశాడు. ‘నేను ఎన్నటికీ మరిచిపోలేని మ్యాచ్‌ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిట్‌నెస్‌ పరీక్షలో పరిగెత్తించినట్టు ధోనీ నన్ను పరుగులు పెట్టించాడు అని ట్విట్‌ చేశాడు. దీంతో ధోనీ వీడ్కోలు గురించి పరోక్షగా కోహ్లీ పోస్ట్‌ చేశాడని ఊహాగానాలు పెద్దఎత్తున వెల్లువెత్తాయి. ధోనీ భవితవ్యంపై మాజీలు స్పందిస్తూనే ఉన్నారు. ధోనీ తన నిర్ణయాన్ని సెలక్షన్‌ కమిటీకి తెలియజేయాలని సూచిస్తున్నారు.
తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/