టీమిండియా స్కోరు 175/4

M S Dhoni
M S Dhoni

సౌతాంప్టన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ, ఆఫ్ఘన్‌ మ్యాచ్‌లో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 135 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌లో ఇప్పటికే పైచేయి సాధించారు. వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్‌కు స్కోరు చేస్తున్న సమయంలో కోహ్లి(67) అనూహ్యంగా 135 స్కోరు వద్ద ఔటయ్యాడు. మహ్మద్‌ నబీ వేసిన బంతిని కట్‌ షాట్‌ చేయబోగా..బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని థర్డ్‌ మ్యాన్‌ రహ్మత్‌ షా చేతిలో పడింది. విజ§్‌ు శంకర్‌(29) రెహ్మత్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు అయ్యాడు. టీమిండియా 40 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఎమ్‌ ఎస్‌ ధోని(22), కేదార్‌ జాదవ్‌(21)లు ఉన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/