బామ్మపై అభిమానం చూపిన ధోని…

Dhoni getting advice from an old lady after loss, is the cutest
Dhoni getting advice from an old lady after loss, is the cutest

ముంబయి: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ధోని కోసం అభిమానులు ఎంతో తెగించి భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి ప్రవేశిస్తుంటారు. ధోని కూడా నిరాశపరచకుండా…వాళ్లతో సరదాగా ఉంటాడు. ఇటీవల జరిగిన ఓ అభిమాని మైదానంలోకి రాగానే ఆ అభిమానిని ఆటపట్టిస్తూ…పట్టుకో చూద్దాం…అంటూ ధోని పరుగులు పెట్టిన వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేసింది. బుధవారం రాత్రి ముంబయి వేదికగా మరో సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మైదానంలోనుంచి అందరూ వెళ్లిపోయినా ఓ బామ్మ మాత్రం ధోనిని కలవాలంటూ ప్లకార్డు పట్టుకొని మైదానంలోనే వేచి ఉంది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో నుంచి ఆ బామ్మను చూసి ఆమెను కలిసేందుకు మైదానంలోకి వచ్చాడు ధోని. ఆమెతో కాసేపు ముచ్చటించాడు. బామ్మ అభిమానం చూసిన ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీపై ఆటోగ్రాఫ్‌ చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. దీంతో పాటు ధోనినే స్వయంగా ఒక సెల్ఫీ దిగి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోసారి ధోని తనేంటో నిరూపించుకున్నాడంటూ అభిమానులు తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/