మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

madhyahna bhojana karmikula dharna
Workers-Strik

తూర్పు గోదావరి: కాకినాడ కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకూడంటూ వారు నిరసన చేశారు. ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుండి వందలాదిమంది మధ్యాహ్న కార్మికులు పాల్గన్నారు. ప్రభుత్వమే పథకాన్ని నిర్వహించాలని, ప్రతి నెల 5 వ తేదీకి బిల్లులు, వేతనాలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెనూ చార్జీలు పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీ రాణి మాట్లాడారు. మిడ్డే మీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ, తదితరులు నిరసనలో పాల్గొన్నారు.


తాజా సినిమా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos