ధర్మసూక్ష్మం

ఆధ్మాత్మిక చింతన

Dharmasuksham
Dharmasuksham

కౌశికుడు ఒక పేద బ్రాహ్మణుడు.భిక్షాటన చేసుకుని బ్రతికేవాడు. అతనికి తల్లిదండ్రులు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాని వారి విషయంలో అంతశ్రద్ధ చూపేవాడు కాదు. బిక్షమెత్తి తెచ్చింది ఇంట్లో ఇచ్చి మిగిలిన కాలాన్ని భగవత్‌ ధ్యానంలో గడిపేవాడు.

అతనికి కోపం కూడా ఎక్కువే. ఒకసారి ఓ వటవృక్షం కింద కూర్చుని భగవత్‌ ద్యానం చేసుకుంటున్నాడు కౌశికుడు.

ఆ చెట్టుకొమ్మ పైన ఉన్న కొంగ అతని తలపై రెట్టవేసింది. తలమీద చల్లగా అనిపించి కోపంగా పైకి చూశాడు. ఆ చూపునకు కొంగ మాడి మసయ్యింది

.ఆహా! తనకెంతటి భగవత్‌ శక్తి వచ్చింది అని మురిసిపోయాడు. కానీ నిష్కారంగా కొంగ చనిపోయిందే అని బాధపడలేదు.

రోజులానే భిక్షాటనకు వెళ్లాడు కౌశికుడు. ఒక ఇంటి ముందు నిలిచి భగవతీ భిక్షాందేహి, అన్నాడు. ఆ ఇంటి నుండి ఏమీ శబ్దం రాలేదు. ఆ రోజుల్లో ఇంటికి వచ్చిన బ్రాహ్మణ భిక్షకులను ఆదరించిపంపేవారు ఇంటి యజమానులు.

ఆ ధీమాతోనే కౌశికుడు భిక్షాందేహి అని రెండు మూడు సార్లు కోపంగా అన్నాడు. ఆ ఇంటి ఇఆ్లలు తీరిక లేదు కొంచెంసేపు ఆగు నాయనా! పని పూర్తి చేసుకుని వస్తాను అంది. ఆమె ఆలస్యంగా భిక్షతెచ్చి అతని జోలెలో వేసింది.

దాంతో కోపంగా ఆమెను చూశాడు కౌశికుడు. ఆమెకు ఏమీ కాలేదు.

చెట్టుమీద కొంగనననుకున్నావా మాడి మసవ్వడానికి. నా పతికి, అత్తమామలకు సేవ చేయడంలో కొంత ఆలస్యమైన మాట నిజమే. అందుకని నన్ను భస్మం చేయాలనుకున్నావు కదా.

నా ధర్మం నేను నిర్వరించడంలో తప్పేముంది? భిక్షకొచ్చిన వాడివి కొంచెంసేపు ఆగలేవా. అంత సహనంలేని వాడివి ఈ వృత్తి ఎందుకెంచుకున్నావు? అని చివాట్లు పెట్టింది ఆ ఇల్లాలు.

‘తల్లీ! చెట్టు మీద కొంగ విషయం నీకెలా తెలిసింది? ఉండబట్టలేక ఆశ్చర్యంగా అడిగాడు కౌశికుడు. నా పతివ్రతా ధర్మమే నాకన్నీ తెలిసేటట్లు చేస్తున్నది.

అందులో ఆశ్చర్యపడవలసింది ఏముంది? నీకింకా ధర్మసూక్ష్మం తెలుసుకోవాలని ఉంటే మిధిలా నగరానికి వెళ్లు, అక్కడ ధర్మవ్యాధుడు అనేక ఒక ఉత్తమ పురుషుడున్నాడు.

అతని ద్వారా నీ కన్నీ తెలుస్తాయి అని చెప్పిందా ఇల్లాలు. కౌశికుడు వెంటనే మిధిలానగరానికి వెళ్లి ధర్మవ్యాధుడు గురించి తెలుసుకోగా అతను మాంసంఅమ్ముకునే కటికవాడనే విషయం తెలిసింది.

ఛీ.. ఛీ! మాంసం అమ్ముకునేవాడు నాకు బోధించేది అనుకుని వెనుదిరిగి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ ఆ ఇల్లాలు అంతగా చెప్పింది కాబట్టి ఒకసారి కలిసి వెళ్లానుకున్నాడు.

ధర్మవ్యాధుని కొట్టు వెతుక్కుంటూ వెళ్లాడు. కౌశికుని చూడగానే అతను ఆ మహాపతివ్రత పంపగా వచ్చారు కదా మీరు సాయంత్రం వరకూ నా వ్యాపారం నడుస్తుంది.

మీరు ఉండగలిగితే ఉండండి అన్నాడు. కౌశికుడు ఆశ్చర్యంతో ఫర్వాలేదు ఉంటాను అని చెప్పి అతను కొట్టుమూసేంతవరకు కూర్చున్నాడు.

అతనిని వెంట బెట్టుకుని ఇంటికి బయల్దేరాడు ధర్మవ్యాధుడు. దారిలో కౌశికుడు అంతనితో జీవహింస పాపము కదా? మీరెంతో ధార్మికులయి ఉండి ఇటువంటి నీచపు పని ఎందుకు చేస్తున్నారు.

ఆ ల్లాలు నన్ను పంపించిందని మీరెలా గ్రహించారు? అంటు ప్రశ్నలు అడిగాడు.

నాయనా! మాది భిల్లుజాతి. కటికులమయిన మాకు ఇది కులవృత్తి. మా కులధర్మాన్ని నెరవేరుస్తున్నాను అన్నాడు.

ఇంటికి చేరాక అతను కౌశికున్ని విశ్రాంతిగా కూర్చోబెట్టి తన కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కాళ్లు చేతులు కడిగి భార్య ఇచ్చిన ఆహారాన్ని వారికి పెట్టి, వాళ్లు విశ్రాంతిగా పడుకున్నాక నిద్రపోయే వరకు తల్లిదండ్రలకు కాళ్లు ఒత్తి అప్పుడు బయటకు వచ్చి కౌశికునికి అతిధి మర్యాలు చేసాడు.

ధర్మవ్యాధులు. ఇప్పుడు మీ సందేహం ఏమిటో చెప్పిండి అని అడిగాడు.

ఆ ఇల్లాలు నా చూపుతో కొంగమాడి మసయిందని గ్రహించింది. మీరేమో ఆ మహాపతివ్రత పంపగా వచ్చారా అని అడిగాడు. మీకిటువంటి దివ్యదృష్టి ఏ సాధనలు చేయగా కలిగిందో చెప్పండి అని అడిగాడు కౌశికుడు. మీము ఏ విధమైన సాధనలు చేయలేదు.

మా ధర్మాలను మేము నియమము తప్పకుండా నిర్వరిస్తున్నాము.

కోపతాపాలు చిరాకు పరాకులు మాకు లేనే లేవు. తల్లిదండ్రులను, భార్యబిడ్డలను పట్టించుకోని నీతో అసలు మాటలేమిటి అనిపిస్తుంది.

కానీ నీ ధర్మాన్ని నీకు తెలియచేయాల్సిన బాధ్య ఉండి మాట్లాడుతున్నాను. నీ మీద రెట్టవేసిన పాపానికి నీవు పొంది భగవత్‌ శక్తితో ఆ కొంగను మసి చేశావు.

అది కావాలని నీ మీద రెట్టవేయలేదు కదా. అని క్షణమైనా ఆలోచించావా? ఏ నాడైనా నీ తల్లిదండ్రులు భార్యబిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు ఆలోచించావా? భిక్షతెచ్చి ఇంట్లో ఇవ్వగానే సరిపోతుందా? అది కాదు పద్ధతి.

ఇకనైనా బాధ్యతగా వారి అవసరాలు చూస్తూ కోపతాపాలు తగ్గించుకుని వృద్ధులైన నీ తల్లిదండ్రులకు సేవచేసుకో. ఏదో ఒక సమయంలో భగవధ్యానము చేసుకో.

అంతేగాకి ఇంట్లో వాళ్లని పట్టించుకోకుంటే భగవంతులడు మెచ్చతాడా? అందరిలో న భగవంతుడు ఉన్నాడు.

అని నమ్ముకుని ఎవరినీ ఏ జివినీ హింసించకుండా ఉండు. అప్పుడూ మాలా నీకు కూడా అన్ని విషయాలు గ్రహించే శక్తి కలుగుతుంది అని బోధించాడు ధర్మవ్యాధుడు.

ధర్మవ్యాధుని మాటల వల్ల జ్ఞానోపదేశమైన కౌశికుడు ఇంటికి చేరుకున్నాడు.

ఆనాటి నుంచి తల్లిదండ్రులను భార్యబిడ్డలను బాధ్యతగా చూసుకుంటూ తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తున్నాడు.

  • వులాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/