ధమాకా టీజర్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ మూవీ టీజర్ వచ్చేసింది. మాస్ మహారాజా నటిస్తున్న కొత్త చిత్రాల్లో ధమాకా ఒకటి. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను శుక్రవారం ఉదయం రిలీజ్ చేసారు. టీజర్ అంత కూడా మాస్ ఫైట్స్ తో ..మాస్ డైలాగ్స్ తో ఆకట్టుకుంది. డిసెంబర్ 22 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు.

YouTube video