‘ధమాకా’ టీజర్ డేట్ ప్రకటించిన మేకర్స్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ టీజర్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మాస్ మహారాజా నటిస్తున్న కొత్త చిత్రాల్లో ధమాకా ఒకటి. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను అక్టోబర్ 21న ఉదయం 10:01 గంటలకు విడుదల చేయనున్నారు. టీజర్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రెండు ఆసక్తికరమైన పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ పోస్టర్లలో ఒకటి రొమాంటిక్ సైడ్ అయితే.. మరొకటి యాక్షన్ సైడ్‌తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రావణాసుర, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాల్లో భాగమవుతున్నారు రవితేజ.