ధమాకా నుండి రొమాంటిక్ గ్లింప్స్ రిలీజ్

వినాయక చవితి సందర్బంగా ధమాకా మూవీ నుండి రొమాంటిక్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. మాస్ మహారాజా నటిస్తున్న కొత్త చిత్రాల్లో ధమాకా ఒకటి. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి రొమాంటిక్ గ్లింప్స్ వచ్చింది. ఈ వీడియోలో రవితేజ పెళ్లిలో శ్రీలీలకి రొమాంటిక్ గా సిగ్నల్స్ ఇస్తూ ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టి పడేసాడు. చాటుగా కలిసేందుకు ఇష్టం లేకపోయినా అతడి ప్రయత్నానికి చివరికి కరిగిపోయి ప్రియురాలు అతనికి ఆమోదం తెలిపింది.

శ్రీలీల సాంప్రదాయ చీరలో అద్భుతంగా కనిపించింది. రవితేజ యూత్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రొమాంటిక్ గ్లింప్స్ యూత్ కి అంతే ఇదిగా కనెక్టయిపోయింది. మొత్తానికి అదిరిపోయే రొమాన్స్ తో రవితేజ మరోసారి రక్తి కట్టించబోతున్నాడని అర్థమవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రావణాసుర, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాల్లో భాగమవుతున్నారు రవితేజ.

YouTube video