రేపు ధమాకా నుండి ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేస్తుంది

మాస్ మహారాజా నటిస్తున్న కొత్త చిత్రాల్లో ధమాకా ఒకటి. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ ను రేపు వినాయక చవిత సందర్భంగా సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ఆ రెండు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ధమాకా తో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.

ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నారు రవితేజ. పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రావణాసుర, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాల్లో భాగమవుతున్నారు రవితేజ.