ధమాకా 5 రోజుల్లో 50 కోట్లు

మాస్ రాజా మహారాజ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద ధమాకా చూపించాడు. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న రవితేజ కు ధమాకా మూవీ బూస్ట్ ఇచ్చింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకొని..బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కేవలం ఐదు రోజుల్లో 50 కోట్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

మొదటి రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు రావడం ఒక విశేషం అయితే, వర్కింగ్ డేస్ లో కూడా మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్స్ ని రాబట్టడం మరో విశేషం. నైజాం ఏరియా లో ఈ సినిమా 5 రోజులకు 9 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసింది. సంక్రాంతి వరకు రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..అన్ని రోజులు రన్ వస్తే కచ్చితంగా 20 కోట్ల రూపాయిల షేర్ కేవలం నైజాం ప్రాంతం నుండి వస్తాయట..ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని రవితేజ నుండి ఎవ్వరూ ఊహించలేదు..ఆయన కెరీర్ కి మరో మైలు రాయిగా ధమాకా నిలిచిపోయింది. త్రినాద్ నక్కిన డైరెక్ట్ చేయగా..శ్రీలీల హీరోయిన్ గా నటించింది.