భక్తిమార్గం

ఆధ్యాత్మిక చింతన

Sun Rises

ఈ మానవజన్మ ఉత్తమమైన జన్మ. జంతూనాం నరజన్మ దుర్లభం అన్న ఆర్యోక్తి వెనుక ఈ నరజన్మ విశిష్టత దాగి ఉంది. సృష్టిలో ఏ జీవికి లేని ఆలోచనా శక్తి, మేధాశక్తి మానవ్ఞనికి ఉన్నాయి.

కృషితో నాస్తి దుర్బిక్షం అన్నట్లు కృషి, పట్టుదల విశ్వాసం గల మానవుడు ఈ పృథ్విలో సాధించలేనిదంటూ ఏదీ లేదు.

సామాన్యమైన బోయవాడైన మునివర వాల్మీకి జరుగబోయే ముందు కథను ఊహించి, రామాయణాన్ని రచించి ఇలా జరగాలి జరుగుతుంది

అని శాసించగలిగాడంటే మానవుడు మహనీయుడా కాదా! ఈ లోకంలో మనుషులు సర్వసాధారణంగా లోకతత్వాన్ని చక్కగా పరిశీలించగలరు. తదనుగుణంగా అన్ని అశుబాల నుండి తమను తాము ఉద్ధరించుకోవాలి.

అందుకు భగవత్‌ భక్తియే సులహమైన మార్గం. బహుజన్మల అనంతరం బహు దుర్లభమైన మనస్‌ుయ జన్మ పొందినాం కనుక బుద్ధిమంతులు పరమాత్ముల లబ్ధికై మృత్యువాత పడకముందే ప్రయత్నించాలి.

ఈ వలయం నుండి మనం బయటికి రావాలి అంటే ఏకైక మార్గం భక్తి. భక్తి వల్ల కలిగేది చివరకు ముక్తి. మానవ జీవితము యొక్క పరమోద్దేశము భగవంతుని సాక్షాత్యారము పొంది పాపజీవితం విముక్తిని పొందుట.

దానిని మరచి విషయ సుఖముల వలన కలుగు తాత్కాలిక సంతోషమునకై ఆయుర్దాయమంతయు వ్యయము చేసి మానవజీవితాన్ని వ్యర్ధము చేసుకొనుటయే ఈనాడు సాధారణముగా జరుగుతున్నది.

తేలిక సంపద ప్రపంచ సంబంధమైన స్థానమానములు, కీర్తి, గౌరవం, వీటి సంపాదనకొరకే ఆయుర్దానమంతయు ఖర్చు చేసిననను, వీటి నుండి మానవుడు ఆశించినంత తృప్తి, శాంతి సంతోషములను ఎన్నటికీ ఎప్పటికీ పొందనూలేడు.

ఒకవేళ పొందినాము అనుకున్నా అది క్షణికమే. కనుక దుఃఖమునకు ఆధారమైన లౌకిక భోగములకై ప్రాకులాడక, భగవత్‌ సాక్షాత్కారమునకు సాధన చేయువాడే గొప్పవాడు.

భగవదనుగ్రహము వలన కలిగిన ఈ మానవజన్మ సార్ధకతకు భక్తిమార్గమే ఏకైక సాధనము. భగవంతుని స్వరూపానందమును అనుభవించుటకే మానవజన్మ ఉద్దేశించపబడినది.

భక్తి అనగా భగవంతుని వద్దకు చేర్చేది. మనం జీవించినంతకాలం భగవంతుని అండ చేర్చేది. ఆ తర్వాత జన్మకు కూడా సద్గతిని కలిగించేది భక్తిమార్గం ఒక్కటే.

ఈ విషయాన్ని మానజవజన్మనెత్తిన అందరూ గ్రహించగలగాలి. భక్తివల్ల మనశ్శాంతి కలుగుతుంది. దైవభక్తి ముందు ఎటువంటి శక్తులు కూడా సరితూగవ్ఞ. కనుక మానవ్ఞలకు దైవభక్తి పవిత్ర రక్షణాకవచమువంటిది.

ఇలా మానసిక ఆచరణ చేసినట్లయితే మనకు ఆత్మ సంయమం కలిగి శీఘ్రంగా ఉద్ధరించబడగలం. అరిషడ్వర్గాన్ని జయించటానికి భగవంతుడు మనకు శక్తిని ప్రసాదించినాడు.

అదియే భక్తి. ఈ భక్తి అనే శక్తితో మనము అరిషడ్వర్గాన్ని జయించగలగాలి.

పవిత్రమైన హృదయంతో అంటే క్షమ, దయ, శాంతి, సమత్వం సంతోషంలో భగమన్నామ స్మరణ చేస్తే ఇంద్రియ మనస్సు బుద్ధి ఈ మూడింటిని భగవంతునితో కలిపినట్లయితే ఇహ పర శ్రేయస్సు కలిగి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.

భగవత్‌ భక్తి మార్గములో చికాకులు చింతలు మానసిక ఆందోళనలు దూరమవ్ఞతాయి. మనస్సుకు ప్రశాంతత లభించేది ఒక్క భగవత్‌ ధ్యానం వల్లనే. భక్తితో భగవంతుని సేవించి ఆరాధించి తరించాలి.

  • ఉలాపు బాలకేశవులు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/