ఏది సుఖం?

ఆధ్యాత్మిక చింతన

The whole thing is in the palm of your hand

సుఖ దుఃఖాలు చక్రం తిరిగినట్లు తిరుగుతూ ఉంటాయి. వాటిని ఆపటం ఎవరి తరమూ కాదంటాడు తులసీదాసు. నిజానికి సుఖమంటే ఏమిటి? హాయిగా ఆనందంగా జీవితనౌక సాగిపోవటాన్ని మనం సుఖంగా భావిస్తాం.

మనసుకు కష్టం కలిగించే వాటినన్నింటినీ మనం దుఃఖాలని పిలుస్తాం. నిజానికి సుఖాలు గానీ దుఃఖాలు గానీ కలకాలం ఉండేవికావు. వాటిని విజ్ఞులు కదిలిపోయే మేఘాలుగా వర్ణించారు.

సుఖాలనుభవిస్తున్నప్పుడు భగవంతుని మరవకు. దుఃఖసమయంలో ఆయన్ని నిందించకు అన్నారు మద్వాచార్యులు. కష్టాలను మనం నెమరువేసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాల దొంతర మనకు ఓ విచిత్రమైన అనుభూతినిస్తుంది.

గతంలో అధిగమించిన బాధలు స్మరించుకున్నప్పుడు వర్తమానంలోని సుఖమాధుర్యం రెట్టంపవుతుందంటారు.

పొలంలో విత్తనం వేసే ముందు రైతు ఎంతో శ్రమిస్తాడు. పొలం దున్నడం నుంచి పైరు విత్తడం దాకా అతని పరిశ్రమ సంక్ష్లిష్టమైనది.

ఫలసాయం వచ్చాక పడిన శ్రమనంతా మరచిపోయి ఆనందం పొందుతాడు రైతు. ఆనందమనే పంట పండాలంటే స్వేదవనే తొలకరి కష్టమనే విత్తులు కావాల్సిందే.

ఒక వ్యక్తి ఉక్కుమనిషా, లేక బలహీనుడా అనేది కష్టకాలంలోనే తెలుస్తుంది తప్ప సాధారణ సమయంలో అందరూ యోగ్యులుగానే చలామణి అవుతారట.

ఇది నార్లమాట. సామాన్యుల సుఖానుభవం, సంపన్నుల రాజభోగం వేరువేరు పాత్రలను అనుసరించి సుఖానుభవం కలుగుతాయి.

ధర్మబద్ధమైన సుఖంలో దోషం లేదు. కానీ వెంపర్లాట కష్టాలు కొని తెస్తుంది. సుఖలాలస మనిషి జీవితాన్నే నాశనం చేస్తుంది. బంగారం నగగా నిగ్గు తేలాలంటే కొలిమిలో కాలడం సుత్తి దెబ్బలు తినడం తప్పనిసరి.

విజ్ఞులు వారికి ప్రాప్తించిన కష్టాలను తమకు రాబోయే రోజుల్లో అంది రాగల ఆనందానుభవానికి పూర్వస్థితిగానే భావిస్తారు. సుఖానుభవం కోరుకునే వారు వాడివైతే ఎప్పుడూ తృప్తిగా ఉండటం అలవాటు చేసుకొమ్మనే వారు భృగుమహర్షి.

నిజం బయటపడే దాకానే చెల్లని రూకలు అసలైనవిగా చలామణి అవుతాయి. సుఖాలు కూడా అంతే. సుఖానుభంలోను మనిషికి సమయం తెలియదు. దుఃఖం క్షణమొక యుగంగా గడుస్తుంది.

చాలా సందర్భాలలో సుఖదుఃఖానుభవాలు రెండూ మనసు చేసే గారడీయే ఒక్కోసారి ఉత్కంఠ తొలగిపోయే దాకా సాధారణ అనుభవం కూడా దుఃఖం ముసుకువేసుకుని ప్రమాదముంది.

సుఖానుభవం ఆనందదాయకమే అయినా ముగింపు బీజరూపంలో ఉండి కష్టమనే మొలక మొలిపిస్తుంది.

విధి చాలా సుఖమా, రాముని సన్నిధిసేవ సుఖమా? నిజముగ పల్కు మా మనసా అంటూ సుఖాలనిగ్గు తేల్చే ప్రయత్నం చేశాడు.

ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజు. ఏది సుఖమో, ఎంతటి సుఖమో ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/