నిరాశను వీడి దేవుడిని వెంబడించు..

jesus cross
jesus cross

‘తమ దోషముచేత హీనదశనొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను..వారియెడల కనికరము పుట్టించెను (కీర్తన 106: 44-46). దేవ్ఞడిని వెంబడిస్తున్న మనం మనదోషం వల్ల, పాపం వల్ల దేవ్ఞడిని బాధిస్తున్నాం. ఆయన కోపం వల్ల మనం శ్రమలపాలైపోతున్నాం. అవ్ఞను ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేకపోతున్నాం. ఏదైతే చేయకూడదనుకుంటున్నామో దాన్ని చేస్తున్నాం. ఇది మన శరీరంలో ఏలుతున్న పాపస్వభావం. అయితే దేవ్ఞడిని ఆశ్రయించినప్పుడు, బలహీనతల్ని విడిచిపెట్టాలనే పట్టుదల, ఆసక్తి ఉన్నప్పుడు మనల్ని ఏలుతున్న బలహీనతలను జయించగలం. దేవ్ఞడు ఆశించే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించగలం.
ప్రార్థన లేకపోతే శోధనలలో పడిపోతాం. శోధనలకు దూరంగా ఉండాలంటే ప్రార్థనాజీవితం తప్పనిసరి. మన జీవితం శోధనలు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే ప్రార్థనకు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించాలి. విశ్వాస జీవితంలో ఆటుపోట్లు, శ్రమలు, పోరాటాలు, శోధనలు వస్తూనే ఉంటాయి. కొన్ని శోధనలు మన పాపం బట్టి వస్తే, మరికొన్ని దేవ్ఞడు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేందుకు దేవ్ఞడు శోధనలకు అనుమతినిస్తాడు. అంతేకాదు ఆ శోధనలను జయించేందుకు కావాల్సిన శక్తిని, మార్గాన్ని కూడా ఇస్తాడు. మన శక్తికి మించి శ్రమలు, శోధనలు ఇవ్వడు. మన సామర్థ్యం బట్టే ఇస్తాడు. ఏదిఏమైనా పాపస్వభావం గల మనం ఆ పాపాన్ని జయించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. దేవ్ఞడి సన్నిధిలో మాత్రమే పాపంపై విజయాన్ని పొందగలం. కాబట్టి పాపం చేస్తున్నామని, దేవ్ఞడిని మెప్పించలేకపోతున్నామని, ఆయనను సంతోషపరచలేకపోతున్నామని నిరాశ చెందేవారు ఇకనైనా ఆ నిరాశను విడిచి, నిజమైన పశ్చాత్తాపమనసుతో క్షమించమని వేడుకుని, మళ్లీ ప్రభువ్ఞ సన్నిధిలో నిత్యం గడిపేందుకు వేడుకుందాం. దేవ్ఞడు అట్టి కృపను అనుగ్రహించునుగాక..

– పి.వాణీపుష్ప