భక్తి- శక్తి

vaartha devotional stories
om

ఏ సత్పురుషుని జీవిత చరిత్ర చదివినా చివరకు ఆ సత్పురుషుడు మరణించక తప్పదు. దేహాన్ని ధరించి, ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవికి అది (మరణం) తప్పనిసరి. సాయి వంటి మహనీయులు తమ మరణ తేదీని, సమయాన్ని నిర్ణయించుకుంటారు. ఇంకా సాయి బాబా వంటి వారు, ఇతరులకు సంభవించబోయే మరణాన్ని గూర్చి హెచ్చరిస్తారు. ఎప్పుడైనా వారు తమ భక్తులను ఆ మరణ ముఖం (గండం) నుండి తప్పిస్తారు. మరణించిన తరువాత మలన్‌బాయికి జీవాన్ని ప్రసాదించాడు సాయి. ప్రథమ దత్తావతారుడైన శ్రీపాద శ్రీవల్లభుడు మరణించిన వల్లభేశుని పునరుజ్జీజవిగా చేస్తాడు. దత్తావతారంలో విశిష్ట స్థానం పొందారు నృసింహసరస్వతి. నృసింహసరస్వతి లీలలు గురుచరిత్రలో కొన్ని విభజించబడ్డాయి. దత్తుడు, సావిత్రి అనువారు దంపతులు. వారు చిలుకాగోరింకల వలె జీవితమును గడుపుచున్నారు. కొంతకాలానికి దత్తునకు క్షయవ్యాధి వచ్చినది. ఎన్ని మందులు వాడినా, వ్యాధి ఉపశమించలేదు. పరిస్థితి విషమించింది. దత్తుని భార్య సావిత్రికి మందుల వలన పనికాదని గ్రహించి, భర్తతో గానుగాపురమున నుండు నృసింహ సరస్వతులను దర్శించుటకు బయలుదేరినది. గానుగాపుర సమీపమునకు రాగానే ఆమె భర్త దత్తుడు ప్రయాణ బడలిక వలన మరణించాడు. కనీసం నృసింహసరస్వతి దర్శనం కూడా వారికి లభించలేదు. సావిత్రి దీనాతిదీనంగా విలపించసాగింది. అందరూ సానుభూతిని చూపగలరుగాని, పోయిన ప్రాణమును ఎవరు తెచ్చి ఇవ్వగలరు? ఇంతలో రుద్రాక్షలు ధరించిన ఒక యతీశ్వరుడు వచ్చాడు. సావిత్రికి ఆయన పతివ్రతా ధర్మాలు బోధించాడు. ఆమె భర్తను పునరుజ్జీవితునిగా చేయలేదు. సావిత్రి సతీహగమనం చేయుటకు అక్కడనే ఏర్పాటు చేసుకున్నది.కడసారిగా ఆమె నృసింహసరస్వతులను దర్శించుటకు బయలుదేరింది. పాదాభివందనం చేసిన సావిత్రిని శ్రీగురుడు నృసింహసరస్వతి ‘అష్ట పుత్ర నిత్య సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించాడు. అక్కడ ఉన్న భక్తులు ‘గురుదేవా! ఈమె భర్త మరణించాడు. సహగమనానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, చివరిసారిగా మీ దర్శనానికి వచ్చింది అన్నారు. ఈ సంగతి నృసింహసరస్వతికి తెలియదా? ఆయన ఆ దత్తుని శవము అక్కడకు తెప్పించాడు. ఆయన (శ్రీగురుని) పాదతీర్థాన్ని శిష్యులు ఆ శవంపై చల్లారు. శ్రీగురుడూ శవాన్ని తన రెండు కనులతో తీక్షణంగా చూచాడు. శ్రీగురుని అమృత దృష్టి ఆ శవంపై పడింది. దత్తుడు పునర్జీవ్ఞడైనాడు. సావిత్రి సంతసమునకు మేరలేదు. ఇది అంతయు చూచుచున్న ఒక వ్యక్తి ‘కాల మృత్యువ్ఞ వాత పడిన వీనిని ఎట్లు బ్రతికించితివి? బ్రహ్మలిఖితమ్ము వమ్మైనదా? అని శ్రీగురుని ప్రశ్నించాడు కుతూహలంతో. నృసింహయతీంద్రులు నవ్ఞ్వతూ ‘వినుము వీని భవిష్యత్‌ జన్మయందు (రాబోయే జన్మయందు) నూరేండ్లు జీవించునని లిఖింపబడియున్నది. నేను బ్రహ్మదేవ్ఞని ప్రార్థింపగా, రాబోయే జన్మమునందలి ఆయువ్ఞను ఈ జన్మకు మార్పించితిని. బ్రహ్మరాతసత్యమే అన్నాడు. ముందు జన్మల నుండి ఆయువ్ఞను, ప్రస్తుత జన్మకు బదిలీ చేయించగల సమర్ధుడే సద్గురువ్ఞ. అసలు బ్రహ్మప్రమేయము లేకుండను, సమర్ధసద్గురువ్ఞ చేయగలడు. ఎలా చేయునన్నది ఆ సద్గురువ్ఞని ఇష్టము. ముందుగ ఏ సద్గురువ్ఞనైనను అంకిత భక్తితో పూజించవలెను కదా!

  • యం.పి.సాయినాథ్‌

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/