యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Lakshmi Narasimha Temple, Yadadri
Lakshmi Narasimha Temple, Yadadri

యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వామి వారి సాధారణ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి కొండపైకి వాహనాలను అధికారులు అనుమతించడంలేదు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/