వైస్సార్సీపీ లో 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారంటూ దేవినేని కీలక వ్యాఖ్యలు

devineni uma
devineni uma

టీడీపీ నేత దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. వైస్సార్సీపీ లో 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. ప్రస్తుతం ఏపీ లో టీడీపీ vs వైస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ప్రజలకు అనేక హామీలు ఇస్తూ మధ్య పార్టీ నేతలు ఆకట్టుకునే పనిలో పడ్డారు.

ఈ తరుణంలో జగన్ కుప్పం నియోజకవర్గం ఫై ఫోకస్ చేయడం పట్ల టీడీపీ నేత దేవినేని ఉమా పలు వ్యాఖ్యలు చేసారు. వైస్సార్సీపీ లో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని… తిరుగుబాటు చేసేందుకు 80 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సొంత ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని జగన్… కుప్పంలో ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతంగా జరిగిందని చెప్పారు. రైతుల పాదయాత్ర జరుగుతుంటే… వీధిలైట్లు తీయించే స్థాయికి బూతుల మంత్రి దిగజారాడని మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు.