జగన్‌ ప్రభుత్వం రివర్స్‌ పాలనకు శ్రీకారం చుడుతుంది

Devineni Uma
Devineni Uma

విజయవాడ: మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరావు ఈరోజు మీడియాతో మాట్లాడుతు పోలవరం ప్రాజెక్టులో మేధావుల సలహాలు కాదని, తన బంధువు సూచనలకు సిఎం జగన్‌ విలువిస్తున్నారని దేవినేని మండిపడ్డారు. జగన్ తమ వర్గానికి పోలవరం పనులు కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పాలనకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుపై కక్షతోనే పోలవరం సహా వివిధ జలవనరుల ప్రాజెక్టు పనులు ఆపేశారని, 7 శాతంగా ఉన్న పోలవరం పనుల్ని 70 శాత్న పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వనిదేనని స్పష్టంచేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/