అటువంటి వ్య‌క్తి పాలనలో రాష్ట్రం ఉంది

‘జగన్ రెడ్డి గుర్తుంచుకో’… అంటూ దేవినేని ఉమ వార్నింగ్

అమరావతి : టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు వైస్సార్సీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. త‌మ నేత‌ల‌పై ఏపీ మంత్రులు ప‌రుష ప‌ద‌జాలంతో వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తాము ఏపీలో అధికారంలోకి వ‌స్తామ‌ని, జగన్ రెడ్డి ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాలంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాల‌రాస్తోన్న‌ ఏపీ మంత్రులతో పాటు అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతామ‌ని తెలిపారు. ఎన్నో కేసుల్లో జ‌గ‌న్ ముద్దాయిగా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

అటువంటి వ్య‌క్తి పాలనలో రాష్ట్రంలో ప‌రిస్థితులుపై ఇంతకన్నా ఏమీ ఆశించలేమ‌ని ఆయ‌న అన్నారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి తాము చెబుతోంటే దాన్ని పక్కదారి పట్టించడానికే త‌మ కార్యాల‌యాలు, ఇళ్ల‌పై దాడులు జ‌రుపుతున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ధ‌ర‌లను పెంచేశార‌ని, ప్రజలు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. జగన్ కు రాష్ట్ర‌ డీజీపీ అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయ‌న కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/