టిడిపికి యువనేత రాజీనామా

Devineni Avinash
Devineni Avinash

విజయవాడ: యువనేత దేవినేని అవినాష్‌ టిడిపికి రాజీనామా చేసారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపారు. అవినాష్‌తో పాటు కృష్ణా జిల్లాకు చెందిన టిడిపి సీనియర్‌ నేత కడియాల బుచ్చిబాబు కూడా రాజీనామా చేసారు. కాగా చంద్రబాబు, లోకేష్‌ వైఖరి నచ్చక పోవడంతో వీరు టిడిపిని వీడినట్టు తెలుస్తుంది పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ గత కొద్ది రోజులుగా అవినాష్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మార్పు అంశంపై తన నివాసంలో దేవినేని నెహ్రు అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించగా సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ మారాలంటూ ఆయన పై ఒత్తిడి తీసుకొచ్చారని సమాచారం. కాగా ఈ రోజు సాయంత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/