దేవిశ్రీ ప్రసాద్ కు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో..మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ కి ఆతిధ్యం ఇచ్చారు. ఈ విషయాన్నీ దేవి శ్రీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. దేవి శ్రీ – మెగాస్టార్ చిరంజీవి ల అనుభందం గురించి చెప్పాల్సిన పనిలేదు. శంకర్ దాదా , శంకర్ దాదా జిందాబాద్ , ఖైదీ నెం 156 , వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తాజాగా చిరంజీవి ఆదివారం ..దేవి కి తన ఇంట్లో అల్పాహారం ఇచ్చారు. చిరంజీవి తో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోలను దేవి ట్విట్టర్ లో అభిమానులతో పంచకున్నారు.

‘బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్‌. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మీరెప్పుడూ మమ్మల్ని స్పెషల్ గా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకెప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్. లవ్‌ యూ సార్‌’ అని ఫోస్ట్‌ చేశారు. ఫొటో తీసిన చిరు కూతురు కొణిదెల సుస్మితకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చిరు భోళాశంకర్ మూవీ తో బిజీ గా ఉంటె..దేవి వరుస మూవీస్ తో బిజీ గా ఉన్నాడు.