అమిత్‌ షాతో దేవేంద్ర ఫడణ్‌వీస్ భేటి

మహా సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయి

Devendra Fadnavis Meets Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మాజీ సిఎం దేవేంద్ర ఫడణ్‌వీస్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ భేటీ రాజకీయ భేటీ కాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో షుర్ ఫ్యాక్టరీలకు ఆర్థిక ప్యాకేజీ విషయంపై కలవడానికి వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా మహారాష్ట్రలో కోవిడ్ పరిస్థితిపై షాకు వివరించామని, ఇదే విషయాన్ని ప్రధాని మోడికి కూడా వివరించడానికి సమయం కోరినట్లు తెలిపారు. అయితే మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం లేదని సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య విభేదాలు ఉన్నాయని… ఈ విభేదాలతోనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. కాగా ఇది కరోనాతో పోరాడాల్సిన సమయం అని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/