దేవేంద్ర ఫడ్నవిస్‌ అత్యవసర కేబినెట్‌ సమావేశం

Devendra Fadnavis
Devendra Fadnavis

మహారాష్ట్ర: మహారాష్ట్రలో ప్రస్తుతం రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఎన్నికలు ముగిసి ఫలితాలొచ్చినా ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై బీజేపీ, శివసేన మధ్య ఇంకా ఓ ఒప్పందం కుదరలేదు. ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర చర్చోపచర్చలు నడుస్తున్నాయి. మరోవైపు, భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులపై స్పందించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేడు అత్యవసరంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పంటల పరిస్థితిపై కలెక్టర్లు, వాతావరణ శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం పంట నష్టంపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని, బీమా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా, ఈ నెల 9 నాటికి పాత శాసనసభ కాలపరిమితి ముగిసిపోతుంది. అప్పటికి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/