జగన్‌ హయాంలో ఏపిలోని అన్ని దేవాలయాల అభివృద్ధి

vellampalli srinivas
vellampalli srinivas

విజయవాడ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకొని మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే ప్రతిపక్షాన్ని, పత్రిక, ఛానల్స్ మూసేయాలని స్వామి వారిని వేడుున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో భవనాలను కూల్చేయడం, ఎఫ్‌డీలను ఇష్టానుసారం ఖర్చు చేశారన్నారు. తాంత్రిక పూజలు, చీర మాయం ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగినవే అని తమ సిఎం జగన్ హయాంలో ఏపిలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నామని తెలిపారు. కాని ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి చేస్తామంటే కూడా‌ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం చేయండి:https://www.vaartha.com/news/national/